Social Post

ప్రభుత్వాన్ని కడిగి పడేసిన యువ NRI

ఎవడండీ మొగాడు Income generate చేసేవాడా ? Income దొబ్బేట్టే వాడా ?
హైదరాబాద్ లో కోట్ల కోట్ల పెట్టుబడులూ, మనకేమో ఇంకా చేదోడూ..చేయూత ఫ్రీ పథకాలు.
ప్రజల చేతికి కల్పించాల్సింది పని. కానీ అడుక్కుతినే పథకాలు కాదు.
గత మూడేళ్ళుగా ఇలా డబ్బు పంచుతూ పోతూ వున్నా.. ఇంకా ప్రజల ఆదాయ అభివృద్ధి, జీవనవిధానాల్లో ఎలాంటి మార్పూ రానట్టే కదా !
ఎంతో క్రియేటివిటీ, శక్తి సామర్ధ్యాలు వున్న యువ శక్తిని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు పరిమితం చేసి,వారి ఎదుగుదలను నాశనం చేస్తున్నారు.
ప్రపంచమంతా IT, Smart City, Chat GPT.. అంటూ దూసుకుపోతుంటే.. మనం ఇంకా యువతతో కుల సర్వేలూ చేయిస్తూ, చాట్ బళ్ళు, నీళ్ళ ట్యాంకులు దగ్గరే ఆగిపోయాం !
మననుండి ఒక నాయకుడు ముందుకొస్తే తోక్కేస్తున్నారు, ఏ మనకి రాజ్యాధికారం రానివ్వరా? మనకి పాలించడం చేతకాదా? ఆ రెండు ఫ్యామిలీలు కాకుండా వేరే వారికి, పాలించే హక్కు లేదా ?
మీకు వ్యతిరేకంగా NRI ఒక్క మాట మాటాడితే, Boycott Bollywood లాగా టార్గెట్ చేసి నోరు నొక్కేస్తారు !
తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు, స్పందించి ఆదుకున్న NRI లు, ఇప్పుడు మాట్లాడితే తప్పా ?
అభివృద్ధి ఎక్కడంటే బూతులు మొదలెడతారు, కాపుల్ని కాపులతో, మహిళల్ని మహిళలతో తిట్టిస్తారు.
తల్లులూ, పిల్లల్ని కూడా తిట్టించి, తెల్ల చొక్కాలేసుకుని నవ్వుకోవడం, ఇదే మీ రాజకీయమా ?
ఇలా ఒకటి కాదు రెండు కాదు, వైసీపీ రాజకీయం నుండి మూడు రాజధానుల నిర్ణయం దాకా ప్రతి పాయింట్ మీద ఏకి పడేసిన ఓ NRI వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఏమాత్రం అమర్యాద, ఆవేశపడకుండా, సార్..సార్ అంటూనే, సమ్మగా రాడ్ దింపిన ఈ NRI మాట తీరు అందర్నీఆకట్టుకుంటుంది.
చివర్లో.. పవన్ కళ్యాణ్ ని ప్రమోట్ చేయడం కొన్ని వర్గాలకి నచ్చక పోయినా, మిగిలిన..నిగ్గదీసి “నిలదీసి ఫై” తీరు మాత్రం అందరూ మెచ్చుకోవాల్సిందే.
మరిన్ని ఇంటరెస్టింగ్ సోషల్ మీడియా స్టోరీస్ కోసం, టచ్ లో వుండండి.