Bhimadole Jatara 2025 Village Festival Gangamma Jatara
ఏలూరు జిల్లా భీమడోలు అమ్మవార్ల పన్నెండేళ్ల జాతర..
కార్యక్రమములు :
ది. 06-2-2025 గురువారం మధ్యాహ్నము 3 గంటలకు :
పోతురాజుబాబుచే మేళతాళములతో “గ్రామ పొలిమేరలు కట్టుట”
ది. 07-2-2025 శుక్రవారం ఉదయం గం. 11-26 ని.లకు :
శ్రీ మద్దిరావమ్మ అమ్మవారిని కాల్వ వద్ద నుండి మేళతాళములతో. బాణాసంచాతో మేడలలోనికి (అమ్మవార్ల గుళ్ళ వద్దకు) తీసుకొనివచ్చుట.
ది. 09-2-2025 ఆదివారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ పోతురాజు, శ్రీ గంగానమ్మ, శ్రీమహాలక్ష్మమ్మ అమ్మవార్లను మేళతాళములతో తీసుకొనివచ్చి గ్రామమునందు “ఊరేగింపు”
ది.10-2-2025 సోమవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 12-2-2025 బుధవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 13-2-2015 గురువారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 14-2-2025 శుక్రవారం ఉదయం గం. 7-00 లకు :
శ్రీ మద్దిరావమ్మ అమ్మవారిని గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
సాయంత్రం గం. 6-00 లకు : శ్రీ మద్దిరావమ్మ అమ్మవారికి గుళ్ళ వద్ద “సంబరం” జరుగును.
ది.15-2-2025 శనివారం రాత్రి గం. 7-00 లకు :
అమ్మవార్ల గుళ్ళ వద్ద పంబలవానిచే “కథ” చెప్పబడును.
ది. 16-2-2025 ఆదివారం ఉదయం గం. 7-00 ల నుండి :
శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు చలిమిడి, పానకాలు సమర్పించుకొనుట.
ది. 17-2-2025 సోమవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 19-2-2025 బుధవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 20-2-2025 గురువారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 21-2-2025 శుక్రవారం ఉదయం గం. 7-00 లకు :
శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి “కలశం”తో గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
రాత్రి గం. 7-00 లకు : శ్రీ మద్దిరావమ్మ అమ్మవారికి గుళ్ళ వద్ద “సంబరం జరుగును.
ది. 22-2-2025 శనివారం రాత్రి గం. 7-00 లకు :
అమ్మవార్ల గుళ్ళ వద్ద పంబలవానిచే “కథ” చెప్పబడును.
ది. 23-2-2025 ఆదివారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు” చలిమిడి, పానకాలు సమర్పించనివారు, శ్రీ అమ్మవార్లకు గుళ్ళవద్ద, ఈ రోజు సమర్పించవచ్చును.
ది. 24-025 సోమవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 25-2-2025 మంగళవారం ఉదయం గం. 7-00 ల నుండి :
శ్రీ నల్లమారెమ్మ అమ్మవారికి “నైవేద్యం” నిమిత్తం పిండిరొట్టె, కారంముద్ద, చుట్టలు గ్రామస్థులు సమర్పించుకొనుట.
రాత్రి గం. 8-00 లకు : శ్రీ నల్లమారెమ్మ అమ్మవారికి “సంబరం” జరుగును.
తెల్లవారుఝామున 5-00 లకు : శ్రీ నల్లమారెమ్మ అమ్మవారిని పంపెదరు (తెల్లవారితే బుధవారం)
ది. 26-2-2025 బుధవారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో “ఊరేగింపు”
ది. 27-2-2025 గురువారం ఉదయం గం. 8-00 లకు :
శ్రీ అమ్మవార్లను గ్రామమునందు మేళతాళములతో ఊరేగింపు”
రాత్రి గం. 8-00 లకు : “గణాచారులను ఊయల ఊపుట”
ది. 28-2-2025 శుక్రవారం ఉదయం గం. 7-00 ల నుండి :
శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి “కలశం”తో గ్రామమునందు, మేళతాళములతో “ఊరేగింపు” అమ్మవారికి చలిమిడి, పానకాలు గుళ్ళవద్ద సమర్పించవలెను.