Top Stories

ప్రకాష్ రాజ్ ను పర్మినెంట్ గా పక్కనపెట్టిన టాలీవుడ్ !?

ప్రకాష్ రాజ్.. పరిచయం అవసరంలేని ఒక పర్వర్టెడ్ విలన్. వెండితెరకు పరిచయం ఐన వెంటనే విలక్షణ టాలెంట్ తో గుర్తింపు పొందిన నటుడు. డైరెక్టర్ కే. బాలచందర్ వెలికితీసిన నాటి మేటి నటులు కమల్ హాసన్, రజనీకాంత్, నగేష్, నాజర్ లాగానే ప్రకాష్ రాజ్ కూడా, తన టాలెంట్ ని గొప్పగా ప్రూవ్ చేసుకున్నాడు. తన మొదటి చిత్రం “డ్యూయెట్” తో మొదలుకొని మణిరత్నం తమిళ్ మూవీ “ఇరువరు” తో సౌత్ ఇండియా మొత్తానికి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు.

ఐతే ఇప్పటివరకూ, తన సినీ ప్రస్థానంలో ఏవో కొన్ని మంచి క్యారెక్టర్ పాత్రలు మినహాయించి, చాలావరకూ నెగిటివ్ విలన్ పాత్రలే ఎక్కువ చేయడం వల్ల, ప్రకాష్ రాజ్ అనగానే ఒక విలన్ గానే ప్రజల్లో ముద్రపడిపోయాడు. నటనలో విలన్ ఐనంతమాత్రాన, నిజజీవితంలో విలన్ కానవసరం లేదు. గతంలో ఎందరో వెండితెర విలన్లు, రియల్ లైఫ్ లో హీరోలుగా కొనియాడబడ్డారు.

ప్రభాకరెడ్డి హైదరాబాద్ లోని తన కోట్లాది రూపాయల విలువైన భూమిని, సినీ కార్మికులకోసం, చిత్రపురి కాలనీ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి, తన దాతృత్వం చాటుకున్నారు. అలానే ప్రకాష్ రాజ్ కూడా తన ఫౌండేషన్ ద్వారా, పలు ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, తన లెఫ్టిస్ట్ భావజాలం, రాడికల్ ఐడియాలజీతో సొసైటీ లో ఒక నెగెటివ్ ముద్ర మోయాల్సి వచ్చింది.

గౌరీ లంకేష్ హత్య నేపథ్యంలో మోడీ – బీజేపీ పై ప్రకాష్ రాజ్ ఆగ్రహం

ముఖ్యంగా హిందూ వ్యతిరేక యాక్టివిస్ట్ ఐన, తన ఫ్రెండ్ గౌరీ లంకేష్ హత్య తర్వాత, మోడీ, బీజేపీ, సంఘ్ పరివార్ పై ద్వేషం పెంచుకొని, తీవ్ర విమర్శలతో విరుచుకు పడుతూ, అదికాస్తా స్రుతిమించి అప్పటి ఢిల్లీ JNU రాడికల్ స్టూడెంట్స్ ఘర్షణల్లో, దేశాన్ని ముక్కలు చేస్తాం అని పిలుపునిచ్చిన, “టుకుడే” గ్యాంగ్ తో వంతపాడుతూ, చివరికి తనుకూడా ఒక హిందూ వ్యతిరేకవాదిగా మారిపోయాడు.

మోడీ – శబరిమల అంశాలపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం

అలాగే, గత “మా” అసోసియేషన్ ఎన్నికల్లో, మెగాస్టార్ చిరంజీవి కోటరీ సపోర్టుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కు, ఇదే నెగిటివ్ ఇమేజ్ తో పాటూ, నాన్-లోకల్ అనే మైనస్ పాయింట్ వల్ల.. ప్రెస్టేజియస్ గా తీసుకున్న మోహన్ బాబు, బాలకృష్ణ కోటరీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.

గతంలో కూడా తెలుగు నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్ అసోసియేషన్లతో పేచీలు పెట్టుకొని, డిసిప్లినరీ యాక్షన్ కింద అనేక సార్లు బ్యాన్ చేయబడ్డాడు ప్రకాష్ రాజ్.

“మా” (MAA) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు రభస

ఎంతో విస్తృతి, ఎన్నో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ వున్న బాహుబలి-1 అండ్ -2 లలో కూడా ప్రకాష్ రాజ్ కు ఛాన్స్ ఇవ్వలేదు రాజమౌళి. కనీసం నాజర్ పోషించిన బిజ్జలదేవ పాత్రను కూడా దక్కించుకోలేక పోయాడు ప్రకాష్ రాజ్. అలానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, “పుష్ప” లోకూడా ప్రకాష్ రాజ్ కు నో ఎంట్రీ నే ఎదురయ్యింది. అందులో ప్రకాష్ రాజ్ కు సూట్ అయ్యే నెగిటివ్ క్యారెక్టర్స్, మంగళం శ్రీను పాత్రకు కమెడియన్ సునీల్ ను, కొండారెడ్డి పాత్రకు అజయ్ ఘోష్ ను పెట్టి మెప్పించాడు సుకుమార్. కనీసం బలగం లాంటి కథాబలం వున్న సినిమాలలో ఐనా ప్రకాష్ రాజ్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఏదో ఫ్రెండ్ షిప్ కొద్దీ కృష్ణవంశీ. నానాపాఠేకర్ మరాఠీ సినిమా “నటసామ్రాట్” రీమేక్ “రంగమార్తాండ” లో ఛాన్స్ ఇచ్చినా, అదికూడా ఫ్లాప్ కావడం, ప్రకాష్ రాజ్ బ్యాడ్ లక్.

అదీకాక ఇప్పటిదాకా, ప్రతీ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన రొటీన్ గా, ఒకటే మూస మొనాటనీ తో బోర్ కొట్టడం కూడా జనాలకు నచ్చడంలేదు. అందుకే ప్రకాష్ రాజ్ కి ఛాన్సులు తగ్గించి, ప్రత్యామ్నాయంగా కొత్త విలన్లు, క్యారెక్టర్ నటులను తెరమీదకు తీసుకొని రావడం చూస్తుంటే.. తెలుగు సినీ పరిశ్రమ మరోసారి గట్టిగానే ప్రకాష్ రాజ్ ను వదిలించుకొని, పక్కన పెట్టినట్టే అనిపిస్తుంది.మీరు clothes కోసం మార్కెట్‌లో ఉన్నట్లయితే, మా ప్లాట్‌ఫారమ్ మీ ఉత్తమ ఎంపిక! అతిపెద్ద షాపింగ్ మాల్!

ఈ విధంగా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు. ప్రకాష్ రాజ్ పతనానికి కూడా తన లెఫ్టిస్ట్ ఐడియాలజీ, రాడికల్ నోటిదూల, హిందూ మరియూ దేశ వ్యతిరేక ఓవర్ యాక్షన్, ముఖ్యంగా దర్శక నిర్మాతలకు, సహా నటులకు అనుకూలంగా, క్రమశిక్షణ, టైమ్ పంక్చువాలిటీ పాటించకపోవడం లాంటివన్నీ కారణాలుగా చెప్పక తప్పదు.

కేరళ స్టోరీస్ ఒక హిందూ ప్రోపగాండా మూవీ -ప్రకాష్ రాజ్

ఎందరో సూపర్ స్టార్ లు, టాలీవుడ్ హీరోలే ఎంతో క్రమశిక్షణతో, డెడికేటెడ్ గా, టైమ్ మెయింటైన్ చేస్తూ దర్శక నిర్మాతలకు సహకరిస్తుంటే, మరి వారికి భిన్నంగా వున్న ఈ తలబిరుసు కమ్యూనిస్టు కామ్రేడ్ కసిరాజ్ ను ఎందుకు భరిస్తారు చెప్పండి.

ఫైనల్ గా, మన దేశ ప్రతిష్టను పెంచిన, చంద్రయాన్ ప్రయోగ విజయాన్ని కూడా అభినందించకపోగా, మోడీపై ద్వేషంతో, ఇస్రోను కించపరుస్తూ, టీ-కలుపుతున్న కేరళా చాయ్ వాలా, కార్టూన్ షేర్ చేసి పూర్తిగా పర్వెర్టెడ్, యాంటీ నేషనల్, యాంటీ సోషల్ ముద్రను కూడా, గుద్దిచ్చుకున్నాడు మన ప్రకాష్ రాజ్.

చంద్రయాన్ పై ప్రకాష్ రాజ్ కార్టూన్ వివాదం

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే బాలీవుడ్ అమీర్ ఖాన్ నుంచి, సౌత్ స్టాలిన్ ఉదయ్ నిధి దాకా, ఎవరైతే హిందూ ద్వేషం, ధర్మవ్యతిరేక భావజాలంతో మిడిసిపడుతూ, అవమానిస్తున్నారో, వారంతా ఇప్పటినుండి ఇలాంటి నిరసన, నిరాకరణ, ధర్మాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు. _సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *