Top Stories

‘జైలర్’లో తమన్నా పాట BGMని అనిరుధ్ ఎక్కడనుంచి కాపీ కొట్టాడో తెలుసా !

ఒకప్పుడు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది, ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనివారైతే అవకాశాలు వచ్చేదాకా ఎవరో ఒక ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ, సంవత్సరాలపాటు పడిగాపులు పడాల్సివచ్చేది. అందుకే సినీ పరిశ్రమలో నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ తో పోల్చితే, మ్యూజిక్ డైరెక్టర్స్ ని మాత్రం వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

ఇళయరాజా వరకూ సాగిన ఈ సాంప్రదాయ పద్ధతికి రాజ్ కోటి, మణిశర్మ, రమణ గోగుల, చక్రి లాంటి యువ డైరెక్టర్ల రాకతో బ్రేక్ పడి కొత్త ట్రెండ్ మొదలయ్యింది, సినిమా నిర్మాణ ప్రక్రియ కూడా వేగం పుంజుకోవడంతో.. ఆ యువ డైరెక్టర్లందరికీ చేతినిండా పనిదొరకడంతోపాటూ.. పాప్ బీట్స్ తో ఫాస్ట్ ఫాస్ట్ మ్యూజిక్ మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి రాకతో డ్యాన్స్ లో స్పీడ్ పెరిగినట్లే సినిమా పాటల మ్యూజిక్ కూడా స్పీడ్ అందుకుంది.

స్వర రాజా ఇళయరాజా మాత్రం ఇందులో ప్రత్యేకం, ఈ స్పీడ్ ఫాలో అవుతూనే.. మెలోడీ పాటలతో మైమరపిస్తూ ఇండియన్ ఫిలిం మ్యూజిక్ మాస్ట్రో గా ఎదిగిపోయారు. ఏ కళారూపమైనా నిరంతర ప్రవాహం లాంటిది. అది ఏ ఒక్కరితోనో మొదలై, వారితోనే ఆగిపోదు. ఆక్రమంలో పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు, తెరమీదకు దూసుకొచ్చిన మరో యువ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా లాగానే.. అటు పాప్, ఫాస్ట్ బీట్ తోపాటు రోజా సినిమా మెలోడీ పాటలతో మెప్పించి, ఇళయరాజాకు ప్రత్యామ్నాయంగా ఎదిగిపోయాడు.

అదే కోవలో తమిళ ఇండస్ట్రీ నుండి దూసుకొచ్చిన మరో బుడత మ్యూజిక్ డైరెక్టర్, అనిరుధ్. వై దిస్ కోలవెరి తో దేశం మొత్తం వేలంవెర్రి పుట్టించి, తమిళ అగ్ర హీరోలతో పాటు జెట్ స్పీడ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్, మల్టీ స్టారర్, పాన్ ఇండియా..మూవీ జైలర్ కు మ్యూజిక్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. అతని వయసుకి మించిన మ్యూజిక్ క్రియేటివిటీ మీద అనుమానం లేకపోయినా తరచుగా కొన్ని కాపీ ట్యూన్స్ తో.. దొరికిపోతూనే వున్నాడు. అందుకనే బాబు పేరుమీద అనిరుధ్ కాపీ క్యాట్ సాంగ్ ట్రోల్స్ అని కొడితే చాలు యూట్యూబ్ నిండా దండిగా వీడియోలు దొరుకుతాయి.

కొన్నేళ్ల క్రితం హీరో నాని గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ సాంగ్ ” గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ ” పాటని పాత హిందీ సూపర్ హిట్ ” ఇన్సాఫ్ అప్నే లహూ సే – 1994 ” లోని హవా హవా నుంచి హ్యాపీగా కాపీ కొట్టేసాడు అనిరుధ్.

దాని ఒరిజినల్ హిందీ పాట కింద చూడండి

అలానే ఇప్పుడు జైలర్ సినిమాలో, తమన్నా కిర్రాక్ డ్యాన్స్ తో పిలుస్తున్న సూపర్ హిట్ ” నువ్వు కావాలయ్యా..
రాహ్ రాహ్ రాహ్ సాంగ్ కూడా.. ఒక పాత నార్త్ – ట్రైబల్ సాంగ్ నుంచి కాపీ కొట్టిందే.. జైలర్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు గడిచిపోయినా, ఇంతవరకూ ఈ కాపీ సాంగ్ మేటర్, సోషల్ మీడియాలో రాకపోవడం ఆశ్చర్యంగావుంది కదా..!

ఐతే..అది సినిమా పాట కాకపోవడం వల్ల, ఇంతవరకూ దాన్ని ఎవరూ కనిపెట్టలేదు.

ఇక ఆ ఒరిజినల్ పాట విషయానికి వస్తే.. అది నార్త్ లో.. బాగా పాపులర్ ఐన ” గావ్ చోడబ్ నహీ.. జంగల్ చోడబ్ నహీ..” అంటూ అడవిబిడ్డలు పాడుకునే ఒక విప్లవ గీతం. మనకు గద్దర్ పాడిన ” ఈ వూరు మనదిరా.. ఈ వాడ మనదిరా” లాంటి పాట.మా భాగస్వాములకు ధన్యవాదాలు, మీరు బడ్జెట్ నుండి టాప్-ఆఫ్-ది-రేంజ్ వరకు ప్రతి ప్రాధాన్యత మరియు బడ్జెట్‌కు సరిపోయేలా ఆన్‌లైన్‌లో tiesని కనుగొనవచ్చు. సూపర్ స్టైలిష్ మోడల్స్.

అభివృద్ధి పేరుతొ అడ్డగోలుగా అడవులను నరికేస్తూ.. నదులను పూడ్చేస్తూ, పర్యావరణాన్నిపాడుచేయడాన్ని ప్రశ్నించే పోడు పామరుల పాట
ఊరిని వదిలేది లేదు.. అడవిని వదిలేది లేదు.. అని ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కైన అవినీతి ప్రభుత్వాలను ధిక్కరించే ఒక సమూహ సహస గానం.

Gaon-Chodab-Nahi-suryatoons

అంత ఘనమైన, సీరియస్ నేపధ్యం గల పాట మ్యూజిక్ ని ఇంత సిల్లీ సినిమా పాటలో, వాడేసాడు మన కాపీ క్యాట్ మాస్టర్ అనిరుద్. ఒరిజినల్ పాటలోని డప్పులు, బూరలు లాంటి ట్రైబల్ వాయిద్యాల సౌండ్స్ ని కూడా, యధాతధంగా వాడిన, ఇదే జైలర్ పాట ప్రీ రిలీజ్ లిరికల్ యానిమేటెడ్ సాంగ్ గా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

ఇలా కాపీ కొట్టిన, కధలు, సీన్లు, సాంగ్స్ ఇండస్ట్రీలో మామూలే. ఒరిజినల్ సాంగ్స్ తో ఇన్ స్పైర్ అయి కానీ, టైమ్ లేకపోవడం వాల్ల కానీ, లేదా నిర్మాత కోరిక మీదకానీ, కారణాలు ఏవైనా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కాపీ సాంగ్స్ చేస్తూనే వుంటారు.

ఒకప్పుడు, వీడియో క్యాసెట్ రోజుల్లో ఈ కాపీ వ్యవహారం ఆంత తొందరగా బైట పడేదికాదు. కానీ నేటి యూట్యూబ్, సోషల్ మీడియా జమానాలో చాలా ఈజీ గా కనిపెట్టేయొచ్చు. పైగా జనాలు కూడా ఒట్టి ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా, సినిమా నిర్మణ, టెక్నీకల్ రంగాల్లో కూడా అవగాహన పెంచుకుంటున్నారు.

So, ఇకపై ఈ కాపీ యవ్వారాలు దాగడం కష్టం. కాపీ ఐతే ఏంటి – గీపీ ఐతే ఏంటి అన్నాయ్, సాంగ్ హిట్ అయ్యిందా లేదా.. అనేదే పాయింట్ అంటే.. ఇంక పీకేదేంలేదు అనుకోండి. _ సూర్య  [ పూర్తి వీడియో చూడండి.. ]

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *