Top Stories

Anantha Sriram and Sid Sriram Telugu Solo Songs

మన తెలుగు సినిమా చరిత్ర ఎంత సుదీర్ఘమైనదో, అందులో ప్రేమలు, ఆ ప్రేమను వ్యక్తపరిచే పాటలు కూడా అంతే సుదీర్ఘమైనవి. ఆనాటినుండి ఎందరో కవులూ, రచయితలూ, సంగీత  దర్శకులు, గాయనీ గాయకులు ఆ పాటలకు ప్రాణం పోస్తూ మనల్ని రంజింపచేస్తున్నారు. వీరందరిలో మనకు బాగా తెలిసేది, మనం బాగా ఇష్టపడేది గాయనీగాయకులనే. పాత తరం గాయకులు ఘంటసాల, పి బి శ్రీనివాస్, రామకృష్ణల తర్వాత, SP బాలసుబ్రహ్మణ్యం, KJ ఏసుదాస్, P సుశీల, జానకి, వాణీ జయరామ్, LR ఈశ్వరీ, వందేమాతరం శ్రీనివాస్, మనో (నాగూర్ బాబు), చిత్రా తదితరులు, కొన్ని దశాబ్దాలపాటు తమ అద్భుత గానంతో అలరిస్తూ వచ్చారు. అన్ని సంవత్సరాల నుండి వారి వందల పాటలు వింటున్నా అన్నీ కొత్తగా, ఎప్పుడూ బోర్ కొట్టకుండా మళ్ళీ, మళ్ళీ వినాలనిపించేవి.

వాటిలో, SP బాలు గారి పాటలైతే మరీ ప్రత్యేకం, కరెక్టుగా హీరో గొంతుకి సరిపోయేలా, గొంతు మార్చి. పాటలోనే అప్పటి హీరోలు NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు లతో పాటు రాజబాబు (మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే.. అందం), (టక్కు టిక్కు టక్కులాడి బండిరా) అల్లు రామలింగయ్య (ముత్యాలూ.. ఆహ్ వస్తావా..), నూతన్ ప్రసాద్ (కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ) లాంటి పాటలతో వారి కామెడీ గొంతుల్ని కూడా మిమిక్రీ చేసి గిలిగింతలు పెట్టించేవారు. వారికి తోడు అప్పటి గీత రచయితలు వేటూరి, సిరివెన్నెల, భువన చంద్ర, వెన్నెలకంటి మొదలైన వారి సాహిత్యం కూడా కథా కథనానికి అనుగుణంగా ఉండేలా వెరైటీ పాటలను అందించేవారు.

ముత్యాలు ఆహ్ వస్తావా | SPB అల్లు రామలింగయ్య పాట

టక్కు టిక్కు టక్కులాడి బండిరా| SPB రాజబాబు పాట

మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం | SPB రాజబాబు పాట

కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుడండీ | SPB నూతన్ ప్రసాద్ పాట

ఇక ఇప్పటి కుర్ర పాటగాళ్ల విషయానికి వస్తే, ఈ టీవీ పాడుతా తీయగా, జీ టీవీ సరిగమప, ఇండియన్ ఐడల్ లాంటి రియాలిటీ ప్రోగ్రాంల ద్వారా, సోషల్ మీడియాలో టాలెంట్ చూపించే అవకాశాలు పెరగడంతో, లక్కు తగిలి లెక్కకు మించి డీజే టిల్లూలు పుట్టుకొస్తున్నారు. ఐనా ఇంతమందిలో ఒక SPB , ఏసుదాస్ లలా, మదిలో మెదిలే వారు మాత్రం చాల తక్కువనే చెప్పాలి. ఏదో పాట కింద పేరు చూసో, ఎక్కడో స్టేజీ మీద పాడుతుంటేనో సదరు గాయకుడిని గుర్తించాల్సిందే తప్ప, పక్కాగా పాటతో వారిని గుర్తు పెట్టుకునేంతగా ఎవ్వరూ లేరు.

క్రేజీ సింగర్ కార్తీక్, రగ్గడ్ గా పాడే రామ్ మిరియాల, ముక్కుతో రాగాలు తీసే సిద్ శ్రీరామ్, జూనియర్ LR ఈశ్వరీ మంగ్లీ – ఇలా వేళ్ళమీద లెక్కపెట్టేవారే వెరైటీ సింగర్స్ గా, కనిపిస్తున్నారు. వీరిలో మరీ మొనాటనీగా, పదేళ్ల నుండి ఏమాత్రం వెరైటీ లేకుండా, ఒకటే టైపు పాటలతో విసిగిస్తున్న సోలో సింగర్ సిద్ శ్రీరామ్.

బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ వరకూ ఐతే ఓకే కానీ, డ్యూయెట్స్ లోమాత్రం సిద్ శ్రీరామ్ గొంతు ఏ తెలుగు హీరో కి సెట్ కావడంలేదు, సినిమాలో అప్పటివరకూ హీరో సొంత గొంతుతో డైలాగ్స్ వింటున్న మనకు, పాట మొదలవగానే, ఉన్నట్టుండి హీరోకి సంబంధం లేని ఎదో వింత గొంతు మొదలైనట్టు, అన్ నేచురల్ గా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇక ఇతని రొటీన్ పాటల విషయానికి వస్తే పదేళ్ల క్రితం ‘ఐ’ సినిమాలోని “నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా” పాటనుంచి – ఈనాటి ‘ఖుషి’ లోని ” ఆరాధ్యా.. ఆరాధ్యా – నువ్వేలేనీదేదీవద్దూ ఆరాధ్యా” వరకూ.. దాదాపు అన్ని పాటలూ ఒకటే ట్యూన్, ఒకటే స్టైల్ స్టీరియోటైప్ పాటలే. ఆ పాటల్లో మ్యాటర్ విషయానికి వస్తే అన్నీ ఒకేలా, హీరోయిన్ ప్రేమకోసం దిగజారిపోయిన హీరో, బ్రతిమాలుకుంటూ, ప్రాధేయపడుతూ, అతిశయోక్తులతో, అడుక్కుంటూ, సాగే సోలో పాటలే.

ఇక్కడ మాత్రం తప్పు పూర్తిగా అతనిది కాదు, కొంత మ్యూజిక్ డైరెక్టర్లది, కొంత ఆ పాటలు రాసే రచయితలది కూడా. ఈ సింగర్ సిద్ శ్రీరామ్ కి తోడయ్యాడు మన రైటర్ అనంత శ్రీరామ్. హీరో, మొగోడు అన్నాక కొంచమైనా హుందాతనం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా !

ఒకవైపు హీరోయిన్లే ఎంతో హుందాగా, హుషారుగా, నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ, నిన్ను చూత్తే ఎట్టనో వుంటదీ.. గుండె గట్టిగా కొట్టేసుకుంటాది” అని పాడుకుంటుంటే. మన హీరోలకు సిద్ శ్రీరామ్ పడే పాటలేమో, కాకినాడ – తిరుపతి ప్యాసింజర్ లో, అడుక్కుంటున్నట్లు, దీనంగా, దీర్ఘాంగా సాగుతూనే వున్నాయి. వాటిని మనోళ్లు గొప్ప మెలోడీస్ క్యాటగిరీ లో వేసేసి ఎంజాయ్ చేస్తున్నట్లు, బోర్ దొబ్బుతున్నా భరిస్తున్నారు.

సరే సిద్ శ్రీరామ్ అంటే, తెలుగు తెలియని పాటగాడు కాబట్టి, పదాలను ఇంగ్లిష్ లోరాసుకొని పాడటం వల్ల ఉచ్ఛారణలో తప్పులు రావచ్చు. అలాంటప్పుడు గీత రచయిత లో, రికార్డింగ్ దగ్గర తెలుగు తెలిసిన వాళ్ళో అతన్ని గైడ్ చేయాలికదా !మా partner-sponsored Glasses‌ని బ్రౌజ్ చేయండి, ప్రతి రుచి మరియు బడ్జెట్‌కు అనుగుణంగా, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే విభిన్న ఎంపికలతో

ఈ సింగర్ శ్రీ రామ్ కి రైటర్ అనంత శ్రీరామ్ రాసే పాటలైతే, మరీ దారుణంగా అచ్చులతో end అయ్యి మళ్ళీ అచ్చుతోనే మొదలయ్యే సంధి కుదరని పదాలు రాయడంవల్ల, అవేవో అర్ధం లేని పదాలుగా వినిపిస్తున్నాయి. లిరిక్స్ చూస్తే గానీ తెలుసుకోలేనంతగా, తిక మక పెడుతున్నాయి. సర్కారు వారి పాట కళావతి పాటలో కమ్మా కమ్మా కి అర్ధం ఏంటో తెలీదు. కళ్ళా అవీ అనడానికి కళ్ళావి అనీ, కళ్ళాపీ అని వినపడేలా, బలవంతంగా సవర్ణదీర్ఘ సంధిలో ఇరికించి పాడేస్తున్నా సరిచేయకుండా వదిలేస్తున్నారు. అలానే ‘ఐ’ సినిమాలో సారో సాంగ్..’నువ్వుంటే’ కు ‘నువ్ ఉల్టే’ అనీ, ‘నేనుంటా’ నేన్ఉల్టా’ అని పాడించేశారు.

ఓపక్క పాటల్లో ఇంత క్లియర్ గా లోపాలు వినిపిస్తున్నా, ఆ విమర్శలపై అనంత శ్రీరామ్ స్పందిస్తూ.. ఇందులో సిద్ శ్రీరామ్ తప్పేమీ లేదనీ, ఉచ్చారణ అంతా కరెక్టుగానే ఉందని, బుకాయించడంలో అతని తలబిరుసు, ఆ పాట విన్న కోట్లాదిమంది శ్రోతల భాషాభిమానాన్ని చులకన చేసే Rude Attitude కనిపిస్తున్నాయి.

తెలుగు సింగర్స్ పాటలతో బోర్ కొట్టినప్పుడల్లా, వెరైటీ కోసం తెలుగు సినిమా, పరభాషా, హిందీ సింగర్స్ ని కూడా బాగానే వాడేసుకుంటుంది. ఒకప్పుడు హిందీ నుంచి మహమ్మద్ రఫీ ( నా మాది నిన్ను పిలిచింది గానమై ) తర్వాత ఉదిత్ నారాయణ్ ( అమ్మాయే సన్నగా ) కేకే ( మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా) కైలాష్ ఖేర్ ( జేజమ్మా ) లాంటి.. మంచి మంచి పాటలనే అందించారు. వాళ్ళ పాటల్లో కూడా తెలుగు కొంత తడబడినా, ఉచ్చారణా లోపాలు రాకుండా జాగ్రత్త పడేవారు. మరీ ఈ సిద్ శ్రీరామ్ పాటల్లా ఒకే స్టైల్ తో బోర్ కొట్టించలేదు.

Mohammad Rafi Telugu Songs

Mohammad-Rafi-Telugu-Songs-suryatoons

Udit Narayan Telugu Songs

KK Telugu Songs

అలనాడు, శ్రీకృష్ణుడు కూడా అలిగిన సత్యభామను బతిమాలుతూ కాళ్ళబేరంతో.. గారాలు చేసినట్లు, పాత సినిమాల్లో చూసాం. పురాణాలు, ప్రబంధాలలో కూడా పురుషపుంగవులు, స్త్రీ సాంగత్యం కోసం ఎన్నో మెట్లు దిగి ఏకాల్సివచ్చింది. అది సృష్టిధర్మం. కానీ ఇక్కడ, ఈ సినిమా పాటలు హీరోని మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని, లవ్ బెగ్గర్ గా, చిత్రీకరించడమే చీప్ గా అనిపిస్తుంది.

 

ఇక్కడ అనంత శ్రీరామ్ పండిత కవి కాదనీ, సిద్ శ్రీరామ్ గొప్ప గాయకుడు కాదని చెప్పడం లేదు. కానీ వీరి, ఏ పాట ఏ సినిమాలోదో, ఏ పాట ఏ హీరోదో కూడా తెలుసుకోలేనంత గందరగోళంగా, పదేపదే వినడానికి బోరింగ్ గా ఉంటున్నాయని చెప్పడమే ముఖ్య ఉద్దేశం _ సూర్య

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *